'ఎర్రచందనం స్మగ్లర్లలపై కఠిన చర్యలు' - redsandel
ఎర్రచందనం అక్రమరవాణా అడ్డుకట్టవేసేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కర్నూలు అటవీ శాఖ సహాయ ముఖ్య సంరక్షణ అధికారి గోపీనాథ్ ఆదేశించారు.
కడప జిల్లా బద్వేలులో అటవీశాఖ అధికారులతో గోపీనాథ్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. 2018లో చేపట్టిన పనులు, ఈ ఆర్థిక సంవత్సరంలో చేపట్టాల్సిన చర్యలపై ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశానికి డీఎఫ్ఓ గురు ప్రభాకర్, వెంకటేశ్వర్లు, ప్రొద్దుటూరు డివిజన్ అటవీశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. స్మగ్లర్లపై కేసులు పెట్టిన వెంటనే వారిని అదుపులోకి తీసుకోవాలన్నారు. ఏళ్ల తరబడి కాలయాపన చేయకుండా తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. అలక్ష్యం వహించే అధికారులపై వేటు పడుతుందని గోపీనాథ్ హెచ్చరించారు.