RED SANDLE SMUGGLERS ARREST IN KADAPA: కడప జిల్లా సిద్ధవటం అటవీ ప్రాంతం నుంచి అక్రమంగా ఎర్రచందనం రవాణా చేస్తున్న ఐదుగురు స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 30 లక్షల రూపాయల విలువ చేసే ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. జిల్లాకు చెందిన బొడ్డే విశ్వనాథ్, ఈశ్వర్ అనే బడా స్మగ్లర్లతోపాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు.
SMUGGLING: అక్రమంగా ఎర్రచందనం రవాణా.. ఐదుగురు స్మగ్లర్ల అరెస్ట్ - kadapa news
RED SANDLE SMUGGLING IN KADAPA: కడప జల్లా సిద్ధవటం అటవీప్రాంతం నుంచి అక్రమంగా ఎర్రచందనం రవాణా చేస్తున్న ఐదుగురు స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 30 లక్షల రూపాయల విలువ చేసే 500 కిలోల ఎర్రచందనం దుంగలు, నాలుగు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.
అక్రమంగా ఎర్రచందనం రవాణా..
ఇద్దరు బడా స్మగ్లర్లపై గతంలో ఒక్కొక్కరిపై ఆరు కేసులు ఉన్నాయని.. వారిపై పీడీ యాక్టు కూడా నమోదు చేస్తున్నామని చెప్పారు. నిందితుల నుంచి 500 కిలోల ఎర్రచందనం దుంగలు, నాలుగు వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టం చేశారు. జిల్లాలో ఎక్కడైనా ఎర్రచందనం అక్రమ రవాణపై సమాచారం వస్తే... వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి:AP CID Raids: మాజీ ఐఏఎస్ లక్ష్మీనారాయణ ఇంట్లో ఏపీ సీఐడీ సోదాలు