కడప జిల్లా ఖాజీపేట వద్ద కారులో మంటలు చెలరేగి దగ్ధమైంది. తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ జిల్లాకు చెందిన చెందిన ఐదుగురు యువకులు చిత్తూరు జిల్లా కాణిపాకం వెళ్తుండగా ఘటన జరిగింది. కాజీపేట వద్దకు వచ్చేసరికి కారు ఇంజన్ నుంచి పొగలు వచ్చి మంటలు చెలరేగాయి. గమనించిన యువకులు వెంటనే కారుదిగి దూరంగా వెళ్లారు. క్షణాల్లో కారు పూర్తిగా దగ్ధమైంది. మైదుకూరు నుంచి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు.
ఖాజీపేటలో కారులో మంటలు - khazipeta
కడప జిల్లా ఖాజీపేట వద్ద కారులో మంటలు చెలరేగి దగ్ధమైంది. అందులో ప్రయాణిస్తున్న యువకులు క్షేమంగా బయటపడ్డారు.
కారు దగ్దం