Thief Arrest: విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడి దొంగగా మారిన యువకుడిని కడప పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి ఆరు లక్షల 50 వేల రూపాయల విలువ చేసే 14 తులాల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. వైయస్సార్ జిల్లా జమ్మలమడుగు గ్రామానికి చెందిన మెరుగు బాబు తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడేవాడు. ఇతనిపై గతంలో 12 కేసులు ఉన్నాయి. కడప నగరంతో పాటు జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో అతనిపై చోరీ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు అతనిపై నిఘా ఉంచిన పోలీసులు.. సిద్ధవటం మండలం భాకరాపేట వద్ద అరెస్టు చేశారు. అతనినుంచి రూ.6.50 లక్షల విలువ చేసే 14 తులాల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన యువకుడిని జిల్లా ఎస్పీ అన్బురాజన్ మీడియా ఎదుట హాజరుపరిచారు. ఈ కేసును ఛేదించిన పోలీసులను ఎస్పీ అభినందించారు.
జల్సాలకు అలవాటు పడి.. దొంగతనాలు చేస్తూ.. - ఏపీ ప్రధాన వార్తలు
కష్టపడి పనిచేయలేక విలాసాలకు అలవాటు పడి చాలా మంది దొంగలుగా మారుతున్నారు. తాళం వేసిన ఇళ్లలోకి వెళ్లి చోరీలకు పాల్పడుతున్నారు. అలాంటిదే వైయస్సార్ జిల్లాకు చెందిన ఒక యువకుడు విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. గతంలో 12 కేసులు ఉన్న ఇతడిని పోలిసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. దొంగ నుంచి నగదును, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఎట్టకేలకు దొంగ అరెస్టు
"12 దొంగతనాలకు పాల్పడిన దొంగను పట్టుకున్నాం. అతని దగ్గర నుంచి ఆరున్నర లక్షల విలువైన బంగారు నగలు స్వాధీనం చేసుకున్నాం. అతన్ని రిమాండ్కు పంపిస్తున్నాం. జిల్లాలో ఈ సంవత్సరం సాధారణ దొంగతనాలు, చోరీలకు సంబంధించిన 83శాతం కేసులను కడప జిల్లా పోలీసులు క్లియర్ చేశారు. ఆస్తి నేరాలను 10 శాతం వరకు తగ్గించాం"-అన్బురాజన్, ఎస్పీ
ఇవీ చదవండి: