ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కొప్పర్తిలో వేగంగా ఎలక్ట్రానిక్స్ మ్యానిఫ్యాక్చరింగ్ క్లస్టర్ పనులు

కడప జిల్లా కొప్పర్తి పారిశ్రామికవాడలో ఎలక్ట్రానిక్స్ మ్యానిఫ్యాక్చరింగ్ క్లస్టర్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో 730 కోట్ల వ్యయంతో 510 ఎకరాల్లో దీన్ని స్థాపిస్తున్నారు. ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. తాజాగా డిక్సన్ టెక్నాలజీ ఇండియా లిమిటెడ్‌తో సర్కారు అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

By

Published : Mar 13, 2021, 4:25 AM IST

Published : Mar 13, 2021, 4:25 AM IST

కొప్పర్తిలో వేగంగా ఎలక్ట్రానిక్స్ మ్యానిఫ్యాక్చరింగ్ క్లస్టర్ పనులు
కొప్పర్తిలో వేగంగా ఎలక్ట్రానిక్స్ మ్యానిఫ్యాక్చరింగ్ క్లస్టర్ పనులు

కొప్పర్తిలో వేగంగా ఎలక్ట్రానిక్స్ మ్యానిఫ్యాక్చరింగ్ క్లస్టర్ పనులు

కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలంలో కొప్పర్తి మెగా పారిశ్రామిక పార్కు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవలే డిక్సన్ కంపెనీతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల...ఈ పరిశ్రమకు కావలసిన షెడ్ల నిర్మాణం పనులను సర్కారు వేగవంతం చేసింది. ఒక్కో షెడ్డు 50 వేల చదరపు అడుగుల్లో....మొత్తం 2 లక్షల అడుగుల విస్తీర్ణంలో వీటిని నిర్మిస్తున్నారు. ఎండవేడిని తట్టుకునేలా ... లోపల ఉన్నవారికి ఎలాంటి రేడియేషన్ ప్రభావం లేకుండా... ఆధునిక ప్లాస్టిక్ షీట్లు, వాటి మధ్యలో రాక్‌పూల్‌తో పైకప్పు నిర్మాణం చేస్తున్నారు. 4 పెద్ద షెడ్లలో 2 షెడ్లు పూర్తి కావచ్చాయి. వచ్చేనెలాఖరుకు వీటిని డిక్సన్‌కు అందించే లక్ష్యంతో పనులు జరుగుతున్నాయి. ఇక్కడ డిక్సన్ ఎలక్ట్రానిక్స్ మ్యానిఫాక్షరింగ్ యూనిట్ ప్రారంభిస్తే... 3 వేల మంది స్థానికులకు ఉపాధి లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు.


కొప్పర్తిలో చిన్న, మధ్యతరహా పరిశ్రమలు నెలకొల్పేందుకు దాదాపు 30 కంపెనీలు ఆసక్తి చూపుతున్నట్లు అధికారులు తెలిపారు. ఫార్మా, జనరల్ ఇంజినీరింగ్ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాయి. హైదరాబాద్‌కు చెందిన 10ఫార్మా కంపెనీలకు ఏపీఐఐసీ ఇప్పటికే స్థలాన్ని కేటాయించింది. పిట్టీ ఇంజినీరింగ్ సంస్థ ఉక్కు, సిమెంట్ కర్మాగారాలకు అవసరమైన విడి భాగాలను తయారు చేసే యూనిట్లను ఇక్కడ నెలకొల్పేందుకు ఆసక్తి చూపుతోంది. పరిశ్రమలకు అవసరమైన విద్యుత్ కోసం సమీపంలో 132 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణం పూర్తికావచ్చింది. సోమశిల వెనుక జలాల నుంచి 0.06 టీఎంసీల నీటిని పరిశ్రమలకు సర్కారుకేటాయించింది.


కొప్పర్తి పారిశ్రామిక వాడపై సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని అధికారులు అంటున్నారు. రెండేళ్లలో 20 వేల మందికి ఉపాధి కల్పించే లక్ష్యంతో సర్కారు పనిచేస్తోందని చెబుతున్నారు.

ఇవీ చదవండి

హుసేనాపురంలో అలరించిన పొట్టేలు, పందుల పోటీలు

ABOUT THE AUTHOR

...view details