కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం వేంపల్లి మండలం ముత్తుకూరు గ్రామానికి చెందిన సంజీవరెడ్డి అనే రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పుల బాధలు తాళలేక విషగుళికలు మింగాడు. నాలుగేళ్లుగా వర్షాభావ పరిస్థితుల వల్ల మూడు బోర్లు వేశాడు. పంటల్లో ఆశించిన దిగుబడి రాక.. అప్పులు పెరిగిపోయాయి. ఇంట్లో ఎవరు లేని సమయంలో విషాపుగుళికలు మింగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. భార్య పొలం పనులు ముగించుకొని ఇంటికి వచ్చి తలుపు తీయగా భర్తను గమనించి స్థానికులకు బంధువులకు తెలియజేయడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. రైతు పెద్ద కుమారుడు శివకుమార్ రెడ్డి బోన్ క్యాన్సర్తో ఇటీవలే మరణించాడు. ఏపీసీసీ ఉపాధ్యాక్షుడు తులసిరెడ్డి, తెదేపా నేత సతీశ్ కుమార్ రెడ్డి మృతుని కుటుంబసభ్యులను పరామర్శించారు.
అప్పుల బాధ తాళలేక... ఆగిన రైతు గుండె - kadapa
పులివెందుల నియోజకవర్గం ముత్తుకూరులో అప్పుల బాధ తాళలేక సంజీవరెడ్డి అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.
రైతు ఆత్మహత్య