కడప కలెక్టరేట్ వద్ద ఓ రైతు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రొద్దుటూరుకు చెందిన రమణకు ఎస్టీ కార్పొరేషన్ కింద 28 లక్షల రూపాయల రుణం మంజూరయ్యింది. దీనికి సంబంధించి అప్పట్లో జాయింట్ కలెక్టర్ శివారెడ్డి రైతుకు చెక్కును అందజేశారు. అయితే పశుసంవర్ధక అధికారులు బాధిత రైతుకు రుణం మంజూరు చేయకుండా నిలిపివేశారు. ఇదేంటని ప్రశ్నిస్తే మంత్రి అనుమతి తీసుకోవాలని చెబుతున్నారని బాధితుడు వాపోయాడు. రుణం వస్తుందన్న ఆశతో తన 16 ఎకరాల పొలంలో డెయిరీ ఫాం ఏర్పాటు కోసం జొన్న పంట వేశానని.. ఇప్పుడు అది రాకపోతే ఆత్మహత్యే శరణ్యమని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. మంజూరైన రుణం కోసం ఐదుసార్లు స్పందన కార్యక్రమానికి వచ్చి కలెక్టరుకు వినతిపత్రం ఇచ్చాననీ.. అయినా ఉపయోగం లేకపోయిందని తెలిపాడు. ఒంటిపై కిరోసిన్ పోసుకున్న రైతును స్థానికులు కాపాడారు. అనంతరం అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు.
రుణం ఇవ్వడం లేదని కలెక్టరేట్ వద్ద రైతు ఆత్మహత్యాయత్నం - farmer suicide news
'మంజూరైన రుణం ఇవ్వడంలేదు.. నాకు న్యాయం జరగట్లేదు. రుణం వస్తుందన్న ఆశతో అప్పుచేసి 16 ఎకరాల్లో పంట వేసుకున్నాను. ఇప్పుడు ఆ అప్పు తీర్చే మార్గం కనిపించడం లేదంటూ' ఓ రైతు కడప కలెక్టరేట్ వద్ద బలవన్మరణానికి యత్నించాడు.
కడప కలెక్టరేట్ వద్ద రైతు ఆత్మహత్యాయత్నం