కొండూరులో విద్యుదాఘాతంతో రైతు మృతి - కడప జిల్లా తాజా వార్తలు
కడప జిల్లా కొండూరు గ్రామంలో విద్యుదాఘాతానికి గురై ఓ రైతు మృతి చెందాడు. పొద్దుతిరుగుడు పంటకు నీళ్లు పెట్టడానికి వెళ్లగా ఈ ప్రమాదం జరిగింది.
కడప జిల్లా అట్లూరు మండలం కొండూరు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. పంటకు నీళ్లు పెట్టడానికి వెళ్ళిన రైతు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. పొలానికి వెళ్లిన పుల్లారెడ్డి ఎంతసేపటికీ ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పొలం వద్దకు వెళ్లి చూడగా.. విద్యుత్ తీగల మధ్య పుల్లారెడ్డి కుప్పకూలిపోయి ఉన్నాడు. తండ్రిని చూసి కుమారులు శోక సముద్రంలో మునిగిపోయారు. పుల్లారెడ్డికి మూడు ఎకరాల పొలం ఉండగా.. వడ్డీకి అప్పులు తెచ్చి పొద్దుతిరుగుడు పంటను సాగు చేశాడు. ఉదయాన్నే విద్యుత్ రావడంతో నీళ్లు పట్టడానికి వెళ్లగా ఈ ఘోరం జరిగింది.