ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రాజంపేటలో త్రీడీ సాంకేతిక పరిజ్ఞానంతో ఫేస్​షీల్డ్

By

Published : May 22, 2020, 2:24 PM IST

కరోనా నుంచి రక్షణపొందేందుకు ప్రజలు అనేక రకాల పద్ధతులను అవలంబిస్తున్నారు. మూతికి మాస్కులు, కర్చీఫ్​లు కట్టుకోవడం వంటివి చేస్తున్నారు. అయితే కంటి ద్వారా కూడా కరోనా వ్యాప్తి చెందుతుందని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు కడపజిల్లా రాజంపేట అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాల మెకానికల్ విభాగంలో సహాయ ప్రొఫెసర్​గా పనిచేస్తున్న వెంకటేష్ త్రీడీ సాంకేతిక పరిజ్ఞానంతో ఫేస్​షీల్డ్​ను తయారుచేశాడు.

Face Shield  made with 3d technology  in rajampeta
రాజంపేటలో త్రీడీ సాంకేతిక పరిజ్ఞానంతో ఫేస్​షీల్డ్

రాజంపేటలో త్రీడీ సాంకేతిక పరిజ్ఞానంతో ఫేస్​షీల్డ్
కరోనా సోకకుండా చేతులు శుభ్రం చేసుకోవాలని, భౌతికదూరం పాటించాలని... మాస్కులు ధరించాలని ప్రభుత్వం అవగాహన కల్పిస్తోంది. కంటి ద్వారా కూడా కరోనా వ్యాప్తి చెందుతుందని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. కడపజిల్లా రాజంపేట అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాల మెకానికల్ విభాగంలో సహాయ ప్రొఫెసర్​గా పనిచేస్తున్న వెంకటేష్ త్రీడీ సాంకేతిక పరిజ్ఞానంతో ఫేస్​షీల్డ్​ను తయారుచేశాడు. త్రీడీ సాంకేతిక పరిజ్ఞానంతో ముఖమంతా కప్పిఉంచేలా మనకు కావాల్సిన ఆకృతిలో వీటిని తయారు చేశారు. ఈ పరిజ్ఞానాన్ని రూపొందించడానికి రూ. 40వేల రూపాయలు ఖర్చు చేశానని.. ఒక్కొక్క ఫేస్​షీల్డ్​ తయారుచేయడానికి రూ. 62 రూపాయలు ఖర్చు అవుతుందని, ఎవరికైనా కావాలంటే కేవలం 65 రూపాయలకే అందజేస్తానని చెప్పారు. దీనివల్ల కంటి ద్వారా కరోనా వ్యాప్తి చెందదని, ఎంతో సురక్షితంగా ఉంటుందని తెలిపారు. వీటిని రాజంపేట ఆర్టీసీ డీఎం బాలాజీ ద్వారా సంస్థలో పనిచేస్తున్న అధికారులకు ఉచితంగా అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details