కడప జిల్లా బద్వేలు సబ్ జైలులో ఖైదీలకు కంటి పరీక్షలు జరిపారు. కడప రిమ్స్ వైద్య నిపుణులు భవానీశంకర్ 41 మందికి పరీక్షలు చేయగా పదిమందికి దృష్టి లోపం ఉన్నట్టు గుర్తించారు. మరొకరిని కంటి శస్త్ర చికిత్స అవసరమమని తేల్చారు. దృష్టిలోపం ఉన్నవారికి కళ్ళజోళ్లను అందిస్తామని జైలుఅధికారి అరుణ్ కుమార్ చెప్పారు. పది మంది ఖైదీలను కళ్ళజోళ్ళ నిమిత్తం బద్వేలు ప్రభుత్వ ఆసుపత్రికి పంపించనున్నట్లు జైలు అధికారి తెలిపారు.
బద్వేలు సబ్ జైలులో ఖైదీలకు కంటి పరీక్షలు - badwel subjail
బద్వేలు సబ్ జైలులో ఖైదీలకు కంటి పరీక్షలు నిర్వహించిన జైలు అధికార్రులు. దృష్టి లోపం ఉన్న వారికి శస్త్రచికిత్సకు సిఫార్సు చేసి, కళ్లజోళ్లు ఇచ్చే ఏర్పాట్లు చేసారు.
eye test to inmates in badwel subjail in kadapa distrct