స్థానిక ఎన్నికలకు దూరంగా ఉంటా:వరదరాజులరెడ్డి - ఏపీలో స్థానిక పోరు వార్తలు
స్థానిక సంస్థల ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్లు కడప జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి అన్నారు. ప్రస్తుతం నీతి, నిజాయితీ లేని రాజకీయాలు కొనసాగుతున్నాయన్నారు. డబ్బలు పంపిణీ చేస్తే గానీ ఓట్లు వచ్చే అవకాశం లేదని వ్యాఖ్యానించారు. అందుకే తాను ఎన్నికలకు దూరంగా ఉంటున్నాని చెప్పారు. వైకాపాలో క్రికెట్ బుకీలు, మట్కా సెంటర్లు నడిపే వాళ్లు ఉన్నారని..వారి ముందు ఎన్నికల్లో తట్టుకోలేమని చెప్పారు.
ex mla varadarajulareddy comments on local bodies elections