కడప జిల్లా ప్రొద్దుటూరు డీఎస్పీ శ్రీనివాసరావు మీద వచ్చిన అవినీతి ఆరోపణలపై పోలీసులు సరైన విచారణ చేయటం లేదని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. పట్టణంలో సీసీ కెమెరాల ఏర్పాటు నెపంతో పురపాలక సంఘం నుంచి 20 లక్షలు, వ్యాపారుల నుంచి 16 లక్షలు డీఎస్పీ వసూలు చేశారని ఆయన ఆరోపించారు. తన రాజకీయ జీవితంలో ఎన్నడూ ఇటువంటి అవినీతిని చూడలేదని పేర్కొన్నారు. డీఎస్పీ అవినీతిపై ఉన్నతాధికారులు బహిరంగ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా సరైన విచారణ చేయకపోతే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
పోలీసుల విచారణ పారదర్శకంగా లేదు! - press meet
ప్రొద్దుటూరు డీఎస్పీ శ్రీనివాసరావు మీద అవినీతి ఆరోపణలపై పోలీసులు సరైన విచారణ చేపట్టలేదని నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులురెడ్డి ఆరోపించారు.
మాజీ ఎమ్మెల్యే