EX minister Aadi Narayana Reddy Reacted On CBN Arrest:వైసీపీ ఎంపీని అరెస్టు చేయకుండా ఆపారని.. మరీ చంద్రబాబు అరెస్టుకు గవర్నర్ ఆమోదం ఎందుకు తీసుకోలేదని బీజేపీ నేత, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్టుపై రాష్ట్రంలోని పలు రాజకీయ పార్టీల నేతలు మండిపడుతున్నారు. టీడీపీ నేత నిమ్మల కూడా చంద్రబాబు అరెస్టుపై మండిపడ్డారు.
Atchannaidu Sensational Comments on CID: ఆధారాలు చూపలేక సీఐడీ మరోసారి బోల్తా పడింది: అచ్చెన్నాయుడు
చంద్రబాబు అరెస్టుపై మాజీ మంత్రి ఆదినారాయణ: కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేయడానికి వెళ్తే ఆపారని.. మరీ గవర్నర్ ఆమోదం లేకుండా చంద్రబాబును ఎలా అరెస్టు చేస్తారని మండిపడ్డారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం నష్ట పోవడానికి కారణం సీఎం జగన్మోహన్ రెడ్డే అని విమర్శించారు.
"చంద్రబాబు అరెస్టు వల్ల ఈ రాష్ట్రానికి చంద్రగ్రహణం పట్టింది. గవర్నర్ ఆమోదితం ఉండాలి. అరెస్టుకు ముందు నోటీసు ఉండాలి. అర్ధరాత్రి అరెస్టు చేస్తారు. అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తామని సీబీఐ వస్తే రానివ్వరు. కర్నూలులో పలు బృందాలను పెట్టి అడ్డుకున్నారు. "- ఆది నారాయణ రెడ్డి, మాజీ మంత్రి
Gutta Sukhendar Reddy on Chandhra Babu Naidu Arrest : 'జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న నాయకుడిని అరెస్ట్ చేయడం బాధాకరం'
రాష్ట్రంలో మద్యపాన నిషేధం లేదని.. మద్యపాన విషాదం జరుగుతోందని వైసీపీ ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నాణ్యత లేని మద్యం తాగి చనిపోతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో రోడ్లు ఘోరంగా ఉన్నాయని.. ఏ ఒక్క రోడ్డు పరిస్థితి బాగాలేదని ఆరోపించారు. ప్రొద్దుటూరులో అసాంఘిక కార్యకలాపాలు ఎక్కువయ్యాయని అన్నారు. చంద్రబాబు తప్పు చేశాడని మాట్లాడే ముందు.. సీఎం జగన్ తన తప్పులు తెలుసుకోవాలన్నారు.
చేతికి సంకెళ్లతో ఎమ్మెల్యే నిమ్మల నిరసన: చంద్రబాబు అరెస్టుపై ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆందోళన నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో రామానాయుడు ఆధ్వర్యంలో.. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా చేపట్టిన దీక్షలు 33వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షల్లో పాల్గొన్న ఆయన న్యాయానికి సంకెళ్లు అంటూ చేతులకు సంకెళ్లు వేసుకుని నిరనస వ్యక్తం చేశారు.
చంద్రబాబును అరెస్టు చేసి 37రోజులు అయ్యిందని.. కానీ, ప్రభుత్వం ఇప్పటికీ చంద్రబాబుకు, ఆయన కుటుంబసభ్యులకు ఒక్క రూపాయి వచ్చినట్లు రుజువు చేయాలేదని రామానాయుడు అన్నారు. ఏ ఒక్క ఆధారం కూడా ప్రభుత్వం చూపలేకపోయిందన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ.. చంద్రబాబును బయటకు రాకుండా అడ్డుపడ్తున్నారని ఆరోపించారు. అందువల్లనే న్యాయానికి సంకెళ్లు అంటూ నిరసన వ్యక్తం చేస్తున్నామని రామానాయుడు వివరించారు.
TDP Activists Protest Against Chandrababu Arrest: బాబు కోసం బారులు తీరిన అభిమానం... వినూత్న రీతిలో నిరసనలు