కడప జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి ఉద్ధృతం అవుతున్న తరుణంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ, ముఖానికి మాస్కులు ధరించే విధంగా అవగాహన కల్పించే చర్యలు చేపట్టామని ఆయన చెప్పారు. మరోసారి జిల్లాలో లాక్డౌన్ విధించకుండా ప్రజలు చైతన్యం కావాలన్న ఆయన... మే 16వ తేదీ నుంచి కరోనా వ్యాప్తి తీవ్రమైందన్నారు. వైరస్ వ్యాప్తి చెందితే చాలా ప్రమాదమన్న ఆయన... ఆ పరిస్థితి రాకుండా జిల్లా యంత్రాంగం కఠిన చర్యలు చేపట్టిందని తెలిపారు. కువైట్ నుంచి జిల్లాకు వచ్చినవారు కూడా ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారన్నారు. జులై 1 నుంచి ప్రతి ఒక్కరికీ కరోనా వైద్య పరీక్షలు నిర్వహించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వివరించారు.
ప్రజలంతా అధికారులకు సహకరించాలి: అంజాద్ బాషా - update news of amdjad basha
కడప జిల్లాలో కరోనా రోజురోజుకి తీవ్రతరం అవుతుంది. దీంతో మరింత అప్రమత్తమయ్యారని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా తెలిపారు. కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు, చేపట్టబోతున్న విధానాలు ఈటీవీ భారత్ ముఖాముఖిలో వెల్లడించారు.
ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషాతో ఈటీవీ భారత్ ముఖాముఖి
ప్రజలు మాస్కులు లేకుండా బయటకు రాకూడదు. నోమాస్క్... నో ఎంట్రీ అనే విధానాన్ని తెస్తున్నాం. ప్రజలంతా కరోనా కట్టడికి ప్రయత్నిస్తున్న జిల్లా అధికారులకు సహకారం అందించాలి -అంజాద్ బాషా, ఉపముఖ్యమంత్రి
ఇదీ చదవండి:అధికారి ఇంట్లో ముగ్గురికి కరోనా పాజిటివ్