కడప జిల్లా బద్వేల్లో చైతన్య ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సంఘం రాష్ట్ర కార్యదర్శి పాల్ రాజ్ హాజరయ్యారు. వృత్తిలో నైపుణ్యం పెంచుకొని కార్మికులు అభివృద్ధి చెందాలని సూచించారు. ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ల సమస్యల పరిష్కారానికి త్వరలోనే ముఖ్యమంత్రి జగన్ను కలిసి వివరిస్తానని తెలిపారు. రాష్ట్రంలో ఎంతోమంది ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ లు పేదరికంతో బాధపడుతున్నారని చెప్పారు.వారిని అన్నివిధాలా ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. 60 ఏళ్ళు నిండిన వారికి ప్రత్యేక పింఛన్ పథకం అమలు చేయాలన్నారు. 645 మండలాల్లో తమ అసోసియేషన్ పనిచేస్తుందని తెలిపారు.
"ప్రైవేట్ ఎలక్ట్రీషియన్లకు పింఛన్ ఇవ్వాలి" - kadapa
ప్రైవేటు ఎలక్ట్రీషియన్లకు పింఛన్ ఇవ్వాలని చైతన్య ప్రైవేటు ఎలక్ట్రికల్ సంఘం రాష్ట్ర కార్యదర్శి పాల్ రాజ్ కోరారు. త్వరలోనే ముఖ్యమంత్రిని కలిసి తమ సమస్యలు విన్నవిస్తామని తెలిపారు.
ఎలక్ట్రీషియన్ సమావేశం