రాజంపేటలో ఎన్నికల సిబ్బంది ఇక్కట్లు - kashtalu
కడప జిల్లా రాజంపేటలో ఎన్నికల నిర్వహణ కోసం వచ్చిన సిబ్బందికి సమస్యలు ఎదురయ్యాయి. ఉదయం 10 గంటలకు ఒక్కసారిగా సిబ్బంది శిబిరానికి చేరుకోవడంతో గందరగోళం ఏర్పడింది. 5 కౌంటర్లు సరిపోకపోవడం... ఒకే టెంట్ ఏర్పాటు చేయడంతో సిబ్బంది ఎండలో బారులు తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కడప జిల్లా రాజంపేటలో ఎన్నికల నిర్వహణ కోసం వచ్చిన సిబ్బందికి సమస్యలు ఎదురయ్యాయి. స్థానిక అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలో పోలింగ్‌కు సంబంధించిన మెటీరియల్, ఈవీఎం, వివి ప్యాడ్లు తీసుకోవడానికి వచ్చిన పివోలు, ఎపీవోలు ఇబ్బందులు పడ్డారు. వివిధ ప్రాంతాల నుంచి ఆర్డర్స్ తీసుకొని వచ్చిన వివిధ విభాగాల అధికారులకు విధులు కేటాయించాల్సి ఉంది... దీనికోసం 5 కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటలకు ఒక్కసారిగా సిబ్బంది శిబిరానికి చేరుకోవడంతో గందరగోళం ఏర్పడింది.
5 కౌంటర్లు సరిపోకపోవడం... ఒకే టెంట్ ఏర్పాటు చేయడంతో సిబ్బంది ఎండలో బారులు తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది. కనీసం తాగునీటి సౌకర్యం కూడా కల్పించలేదని ఎన్నికల నిర్వహణకు వచ్చిన సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. చంటి పిల్లలతో వచ్చిన మహిళలు చెట్లకింద విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం రెవెన్యూ అధికారులు కలగజేసుకొని పోలింగ్ సిబ్బంది నుంచి ఆర్డర్ కాపీ తీసుకొని విధులను కేటాయించారు.