కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన ఎల్లమ్మ.. కడప జిల్లా రాజంపేట దగ్గర రైలు కింద పడి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించింది. పట్టాలపైకి వెళ్తున్న సమయంలో.. అక్కడికి సమీపంలోనే ఉన్న జిల్లా కోర్టు పారా లీగల్ వాలంటీర్ దశరథరామిరెడ్డి, మరో వ్యక్తి గమనించారు. ఆమెను కాపాడారు. తనకు ఎవరూ లేరని.. ఉన్న మనవళ్లు, మనవరాళ్లు పట్టించుకోవడం లేదని.. తరిమేశారని ఆ వృద్ధురాలు వారికి చెప్పుకొని కన్నీటిపర్యంతమైంది. ఈ వయసులో అందరితో అన్ని మాటలు పడాల్సిన అవసరం లేదని, తనువు చాలిస్తే ఎవరికీ ఇబ్బంది ఉండదని చెమ్మగిల్లిన కళ్ళు తుడుచుకొంటూ చెప్పిన మాటలు అక్కడి వారిని కలచివేశాయి. వృద్ధురాలిని కాపాడిన దశరథరామిరెడ్డి ఈ సంఘటనను పట్టణ ఎస్ఐ ప్రతాప్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాడు. అక్కడినుంచి జిల్లా న్యాయమూర్తి వద్దకు తీసుకెళ్తున్నట్లు ఆయన తెలిపారు.
బంధం భారమైంది... బతుకు బరువైంది
ఎనిమిది పదుల వయసులో ఆ తల్లికి కష్టమెుచ్చింది. పట్టెడు అన్నం పెట్టేవారు కరవయ్యారు. అన్నీ తానై పెంచి, పెద్ద చేసి పెళ్లిళ్లు చేస్తే... పిడికెడు అన్నం పట్టలేక మనవళ్లు గెంటేశారు. ఆసరాగా నిలిచిందనుకున్న మనవరాలు తిట్టి తరిమేసింది. అయినవారే కాదన్న పరిస్థితుల్లో బతకడం ఎందుకని భావించిన ఆ వృద్ధురాలు.. రైలు కిందపడి ఆత్మహత్యయత్నానికి పాల్పడిన ఘటన కడప జిల్లా రాజంపేట రైల్వేస్టేషన్లో చోటుచేసుకుంది.
బంధం భారమైంది...బతుకు బరువైంది