ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఎన్​ఆర్ఐ దాతృత్వం: కొవిడ్ ఆస్పత్రికి 90 పీపీఈ కిట్లు అందజేత

కడప జిల్లా రాజంపేట వైద్య విధాన పరిషత్ ఆస్పత్రికి ఓ ఎన్​ఆర్​ఐ 90 పీపీఈ కిట్లను ఉచితంగా అందజేశారు. త్వరలో 10 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లనూ అందిస్తామని హామీ ఇచ్చారు.

By

Published : May 16, 2021, 11:10 AM IST

Published : May 16, 2021, 11:10 AM IST

PPE KITS
ఎన్​ఆర్ఐ దాతృత్వం: కొవిడ్ ఆస్పత్రికి 10 బెడ్లు, 90 పీపీఈ కిట్లు అందజేత

కడప జిల్లా రాజంపేట ఆస్పత్రికి ఎన్​ఆర్​ఐ రజినేష్ 90 పీపీఈ కిట్లను అందజేశారు. అమెరికాలో నివాసం ఉండే రజినేష్.. కొవిడ్ బాధితుల కోసం నిధులు సమకూర్చి రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. అనంతరం వీటిని ఆస్పత్రి సూపరింటెండెంట్ మాధవ్​కుమార్ రెడ్డికి అందజేశారు. త్వరలోనే 10 కాన్సంట్రేటర్లను సమకూర్చుతామని ఆయన పేర్కొన్నారు.

10 బెడ్లు ఏర్పాటు..

కరోనా రోగుల కోసం కొవిడ్ వార్డుకు 10 పడకలను ఏర్పాటు చేసినట్లు సూపరింటెండెంట్ వెల్లడించారు. అందులో ఐదు బెడ్లకు ఆక్సిజన్ సిలిండర్ సదుపాయం ఉన్నట్లు స్పష్టం చేశారు. కొవిడ్ బాధితులు ఆస్పత్రిలోనికి వచ్చేందుకు ప్రత్యేక ద్వారం ఏర్పాటు చేశామన్నారు.

ఇదీ చదవండీ..ఆగని రెమ్‌డెసివిర్‌ దందా.. వైద్య సిబ్బంది ప్రమేయంతో నల్లబజారుకు

ABOUT THE AUTHOR

...view details