ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దాదర్ ఎక్స్​ప్రెస్​లో పొగలు.. తప్పిన పెను ప్రమాదం - stopped

దాదర్ ఎక్స్​ప్రెస్ కడప రైల్వే స్టేషన్​కి చేరుకోగానే ఓ బోగీలో పొగలు చెలరేగాయి. అనుకోని ఘటనతో భయపడిన ప్రయాణికులు వెంటనే రైలు దిగేశారు.

రైలు(ఫైల్)

By

Published : May 19, 2019, 2:03 PM IST


ముంబయి నుంచి చెన్నై వెళ్తున్న దాదర్ ఎక్స్​ప్రెస్​కు త్రుటిలో ప్రమాదం తప్పింది. కడప స్టేషన్​కు చేరుకున్న తరువాత ఎస్​-2 బోగీలో ఒక్కసారిగా పొగలు వచ్చాయి. భయభ్రాంతులకు గురైన ప్రయాణికులు వెంటనే రైలు దిగారు. రైలును పరిశీలించిన సిబ్బంది బోగీలోని వీల్ వద్ద సాంకేతిక లోపం కారణంగా పొగలు వచ్చినట్లు గుర్తించారు. అరగంట పాటు మరమ్మతుల అనంతరం రైలు చెన్నైకు బయలుదేరింది. ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details