ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఏపీ కొవిడ్ ఆస్పత్రిలో వైద్యం బాగుంది.. కానీ..'

ఏపీ ఉపముఖ్యమంత్రికి, ఆయన భార్యకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ కారణంతో మొదట తిరుపతి ఆస్పత్రిలో చికిత్స పొంది...ఇప్పుడు హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే.. ఏపీ ఆస్పత్రుల్లో వైద్యం సరిగా అందడం లేదా... అంటూ విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఉపముఖ్యమంత్రి స్పందించి ప్రకటన విడుదల చేశారు.

By

Published : Jul 16, 2020, 7:18 PM IST

deputy cm respond
deputy cm respond

ఉపముఖ్యమంత్రి అంజాద్ భాషా లేఖ

ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా.. తనకు కరోనా సోకడంపై స్పందించారు. తనకు, తన భార్యకు కరోనా లక్షణాలతో తిరుపతి ఆసుపత్రిలో చికిత్స పొందామని తెలిపారు. అయితే.. తన భార్యకు గతంలో అనారోగ్యంతో శస్త్ర చికిత్స జరిగిందని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా సోకిందని.. వైద్యులు, ఉన్నతాధికారులు సూచించిన మేరకే ముందు జాగ్రత్తగా హైదరాబాద్ లో చికిత్స తీసుకుంటున్నామని ఓ ప్రకటనలో వివరించారు.

ఉపముఖ్యమంత్రి అంజాద్ భాషా లేఖ

ఇప్పుడు తమ ఇద్దరి ఆరోగ్య పరిస్థితి బాగుందని వెల్లడించారు. రెండు రోజుల్లో డిశ్చార్జ్ అవుతామని పేర్కొన్నారు. రాష్ట్రంలో కోవిడ్ ఆసుపత్రిలో మంచి వైద్యం అందుతోందని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. కొవిడ్ వ్యాప్తి పరిస్థితుల్లో సేవలు అందిస్తున్న వారిని ప్రశంసించారు. తన ఆరోగ్యం కోసం ప్రార్థించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details