కడప జిల్లా ఒంటిమిట్టలో శ్రీకోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ రోజు ఉదయం ధ్వజారోహణ కార్యక్రమంతో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు అధికారికంగా మొదలయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులు రాజ్ కుమార్ ఆద్వర్యంలో పండితుల బృందం వైభవంగా నిర్వహించింది. సీతారామలక్ష్మణుల ఉత్సవ మూర్తులను పుష్పాలతో అందంగా అలంకరించి.... ఆ స్వాముల ఎదురుగానే ధ్వజారోహణ కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ధ్వజస్తంభానికి గరుత్మంతుడుని ఆరోహణ చేసి... శిఖరంలో ప్రతిష్టించారు. బ్రహ్మోత్సవాలు ముగిసే వరకు ఎలాంటి ఆటంకాలు లేకుండా గరుత్మంతుడు చూసుకుంటారనేది ప్రతీతి.
ఈనెల 18న కోదండరామస్వామి కల్యాణ మహోత్సవం జరగనుంది. ధ్వజారోహణ కార్యక్రమానికి ప్రముఖులు, తితిదే అధికారులు, భక్తులతోపాటు వైకాపా నేతలు మేడా మల్లికార్జునరెడ్డి, అంజద్ భాషా, మేయర్ సురేశ్ బాబు హాజరయ్యారు.
వైభవంగా ఒంటిమిట్ట రాములవారి ధ్వజారోహణం - rama
కడప జిల్లా ఒంటిమిట్టలో శ్రీకోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ రోజు ఉదయం ధ్వజారోహణ కార్యక్రమంతో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు అధికారికంగా మొదలయ్యాయి
వైభవంగా ఒంటిమిట్ట రాములవారి ధ్వజారోహణం