కరోనా ప్రభావంతో రెండో రోజూ కడప జిల్లాలో రవాణా వ్యవస్థ స్తంభించింది. బస్టాండ్లో ప్రయాణికులు లేక వెలవెలబోతున్నాయి. బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 8 డిపోల పరిధిలో దాదాపు 900 బస్సు సర్వీసులను నిలిపివేశారు. ఆర్టీసీ కార్గో వ్యవస్థనూ మూసివేశారు. రైల్వే స్టేషన్లోనూ ప్రయాణికులు లేక ప్లాట్పారాలు నిర్మానుష్యంగా మారాయి. రవాణా వ్యవస్థ స్తంభించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
జనసంచారం లేక వెలవెలబోతున్న కడప - lockdown lockdown
రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ ప్రభావంతో కడప జిల్లాలో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. బస్సులు, రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణ ప్రాంగణాలు నిర్మానుష్యంగా మారాయి.
జనసంచారం లేక వెలవెలబోతున్న కడప