పోలింగ్ సందర్భంగా కడపజిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి పోలీసుశాఖ తరపున పటిష్టమైన చర్యలు చేపట్టామని ఎస్పీ అభిషేక్ మొహంతి స్పష్టం చేశారు. జిల్లాలో ఎన్నికలు ముగిసే వరకు 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎవరైనా అల్లర్లు సృష్టించినా... గొడవలకు దిగినా పోలీసు చర్యలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. జిల్లాలోని పులివెందుల, జమ్మలమడుగుతోపాటు అత్యంత సమస్యాత్మక గ్రామాల్లో కేంద్ర పారామిలటరీ దళాలతో ప్రత్యేక నిఘా పెట్టామన్నారు.
నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలే...! - kadapa
ప్రతి ఓటరు స్వేచ్ఛగా ఓటు వేసే విధంగా పటిష్ఠ చర్యలు చేపట్టామని కడప ఎస్పీ అభిషేక్ మొహంతి స్పష్టం చేశారు. ఎవరైనా అల్లర్లు సృష్టించినా... గొడవలకు దిగినా పోలీసు చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
కడప ఎస్పీ అభిషేక్ మొహంతి