ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రాయచోటిలో కొవిడ్ కేర్ సెంటర్ ప్రారంభం

By

Published : Aug 12, 2020, 6:45 PM IST

కడప జిల్లా రాయచోటిలో కొవిడ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. పాజిటివ్ వచ్చిన వ్యక్తులను రాయచోటికి 50 కిలో మీటర్ల దూరంలో ఉన్న జిల్లా కేంద్రమైన కడపకు తరలించడం భారంగా మారింది. ఈ కారణంగా.. రాయచోటిలోనే కొవిడ్ కేర్ సెంటర్​ను ప్రారంభించారు.

covid care center started in rayachoti
covid care center started in rayachoti

రాయచోటిలో కొవిడ్ కేర్ సెంటర్​ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ జకియ ఖానాం.. కేర్ సెంటర్​ను ప్రారంభించారు. మూడు వందల పడకలతో అన్ని వసతులు.. కలిగిన సెంటర్​ను ఏర్పాటు చేసినట్లు శ్రీకాంత్​రెడ్డి చెప్పారు. ఈ కేంద్రం స్థానికులకు అనుకూలంగా ఉంటుందని పేర్కొన్నారు.

కొవిడ్ బాధితులు ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కేంద్రంలో ముగ్గురు వైద్యులు, ఇతర సిబ్బంది అందుబాటులో ఉండి వైద్య సేవలు అందిస్తారని తెలిపారు. అత్యవసరమైతే.. ఇక్కడ నయం కాని వారికి ప్రత్యేక వాహనంలో కడపలోని కొవిడ్ ఆసుపత్రికి తరలిస్తారని చెప్పారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details