కడప జిల్లా మైదుకూరు పోలీస్‌స్టేషన్ ఆవరణలో రెండు వర్గాలు ఘర్షణ పడ్డాయి. కానిస్టేబుళ్లు, పోలీసు సిబ్బంది వారించే ప్రయత్నం చేసినా... ఖాతరు చేయలేదు. మండలంలోని భీమలింగాయపల్లె గ్రామానికి చెందిన చాంద్‌బాషా అనే యువకుడికి మైదుకూరుకు చెందిన యువతితో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. విభేదాలతో భార్యాభర్తలు విడిపోయారు. పెళ్లప్పుడు ఇచ్చిన వస్తువులు ఇప్పించాలంటూ... యువతి ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఇరువర్గాలను పిలిపించారు. పెద్దలతో పోలీసులు మాట్లాడుతున్న సమయంలో ఇరువర్గాల మధ్య మాటామాట పెరిగింది. అది ఘర్షణకు దారి తీసింది. పోలీస్‌స్టేషన్ ఆవరణలో బాహాబాహీ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
పోలీస్‌స్టేషన్‌లో బాహాబాహీ... రెండువర్గాల ఘర్షణ
కడప జిల్లా మైదుకూరు పోలీస్‌స్టేషన్ ఆవరణలో రెండువర్గాల ఘర్షణపడ్డాయి. ఇరువర్గాల పెద్దలతో పోలీసులు మాట్లాడుతుండగా... మాటామాటా పెరిగి ఒకరిపై ఒకరు దాడికి దిగారు.
పోలీస్‌స్టేషన్ ఆవరణలో రెండువర్గాల మధ్య ఘర్షణ