ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'కార్మిక వ్యతిరేక విధానాలు మానుకోవాలి'

By

Published : Aug 24, 2020, 11:22 AM IST

కార్మికుల పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్షను చూపిస్తోందని సీఐటీయూ నాయకులు రాయచోటిలో నిరసన కార్యక్రమం చేపట్టారు.

CITU leaders protest in Rayachoti
రాయచోటిలో సీఐటీయూ నిరసన కార్యక్రమం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను మానుకోవాలని.. సీఐటీయూ ఆలిండియా కమిటీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో...ఆదివారం కడప జిల్లా రాయచోటి పట్టణంలోని పాత పురపాలక కార్యాలయం ఆవరణంలోని సచివాలయాల వద్ద యూనియన్ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు.

కేంద్రంలోని భాజపా ప్రభుత్వం.. కొవిడ్ అని చూడకుండా... కార్మిక హక్కులు, చట్టాలను కాలరాస్తోందని సీఐటీయూ నాయకులు విమర్శించారు. కార్మికుల పట్ల కేంద్రం చూపిస్తున్న వివక్షను ఖండించాలని పిలుపునిచ్చారు. పని భారం పెంచి జీతాలు సకాలంలో ఇవ్వకుండా మోపుతున్న నిర్బంధాన్ని ఐక్య ఉద్యమాలతో ప్రతిఘటిస్తామన్నారు.

పెట్టుబడిదారుల సంక్షేమం కొరకే భాజపా పని చేస్తోందని విమర్శించారు. కరోనా కాలంలో ప్రతి పేద కుటుంబానికి 6 నెలలు పాటు రూ.7వేల 500, పట్టణాలలో యువతకు ఉపాధి, కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, ఔట్ సోర్సింగ్ వారికి కనీస వేతనం 21వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏ రామాంజనేయులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

రాష్ట్రంలో కొత్తగా 7895 కరోనా కేసులు...93 మరణాలు

ABOUT THE AUTHOR

...view details