ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పోలీస్ స్టేషన్ ఎదుటే ఆత్మహత్య చేసుకుంటాం' - investigation

వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణ పేరుతో తమ పిల్లలను వేధిస్తున్నారని పులివెందులలోని ఇస్లాంపురం వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం జరగకపోతే చావే శరణ్యమంటున్నారు.

గౌషియ, ఇస్లాపురం వాసి

By

Published : Mar 24, 2019, 8:53 PM IST

వివేకానందరెడ్డి హత్య కేసు విచారణపై వివాదం
ప్రతిపక్ష నేత జగన్ బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. సిట్ బృందం పలు కోణాల్లో దర్యాప్తు చేస్తుండగా.. కడప జిల్లా పులివెందులలోని ఇస్లాంపురం వీధికి చెందిన 8 మంది యువకులను పోలీసులు తమ కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. అయితే తమ పిల్లలు హత్యలు చేసే వారు కాదని యువకుల తల్లిదండ్రులు అంటున్నారు. వైఎస్ కుటుంబానికి హాని కలిగించినట్లయితే తామే చంపుతామని వారు చెప్పారు. అర్థరాత్రి వేళ కూడా తమ ఇంటి వద్దకు వచ్చి మానసిక వేదనకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కడపలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థి బాబావల్లిని కూడా పోలీసులు విచారణ పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని.. అతని తల్లి బోరున విలపిస్తోంది. తమ వారిని వెంటనే వదిలిపెట్టాలని లేనిపక్షంలో కుటుంబం మొత్తం పోలీస్​ స్టేషన్ ఎదుట కిరోసిన్​ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడతామని హెచ్చరిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details