ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కడపజిల్లాలో చైనా బృందం పర్యటన - brahmani steel factory

శుక్రవారం కడప జిల్లాలో నలుగురు సభ్యులతో కూడిన చైనా బృందం పర్యటించింది.

చైనా బృందం

By

Published : Aug 17, 2019, 9:41 AM IST

కడపజిల్లాలో చైనా బృందం పర్యటన

శుక్రవారం కడపలో కొప్పర్తి పారిశ్రామికవాడలో చైనా బృందం పర్యటన జరిపింది. అనంతరం జమ్మలమడుగు మండలంలోని బ్రాహ్మణి ఉక్కు కర్మాగారం స్థలంలో పర్యటించారు. ఈ ప్రాంతంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు పై సాధ్యాసాధ్యాల గురించి విశ్లేషించారు. జమ్మలమడుగు ఆర్డీవో నాగన్న ఇతర రెవెన్యూ అధికారులు వారితోపాటు ఉన్నారు .బ్రాహ్మణి ఉక్కు కర్మాగారం స్థలంలో ఏఏ వనరులు ఉన్నాయి, నీటి లభ్యత, ఎంత భూమి ఉంది, ఐరన్ ఒర్, ఎక్కడి నుంచి తరలించవచ్చు, ఎంత దూరం ఉంది . తదితర విషయాలపై ఆరా తీశారు. బ్రాహ్మణి ఉక్కు కర్మాగారం మధ్యలోనే ఎందుకు ఆగిపోయింది అని అడగ్గా..... రెవెన్యూ అధికారులు కొన్ని రాజకీయ కారణాల వల్ల ఆగిపోయినట్లు చెప్పారు. ఈ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ఒక నిర్ణయానికి వస్తామని చైనా బృందం తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details