మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. హత్యకు ఉపయోగించిన ఆయుధాల కోసం పులివెందులలో మూడు రోజుల పాటు సీబీఐ అధికారులు అన్వేషించారు. ఎలాంటి ఆయుధాలు దొరక్కపోవటంతో అన్వేషణ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసింది.
Viveka Murder Case: ఆయుధాల అన్వేషణ తాత్కాలికంగా నిలిపివేసిన సీబీఐ - viveka murder case news
మాజీ మంత్రి వివేకా
13:06 August 10
మాజీ మంత్రి వివేకా హత్య కేసు
65వ రోజు విచారణ
వైఎస్ వివేకా హత్యకేసులో 65వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. పులివెందుల ఆర్అండ్బీ అతిథి గృహంలో అనుమానితులను అధికారులు ప్రశ్నిస్తున్నారు. నేడు పోలీసు అధికారి శంకరయ్యను అధికారులు విచారిస్తున్నారు. వివేకా హత్య జరిగినప్పుడు పులివెందుల సీఐగా శంకరయ్య ఉన్నారు. 2019 మార్చి 15న మాజీ మంత్రి వివేకా తన నివాసంలో దారుణహత్యకు గురయ్యాడు.
ఇదీ చదవండి
VIVEKA MURDER CASE: 'పెద్ద తలలు తప్పించుకునేందుకే పన్నాగం!'
Last Updated : Aug 10, 2021, 2:02 PM IST