కడప జిల్లా బద్వేల్ 67వ జాతీయ రహదారిపై కారు ప్రమాదం జరిగింది. శ్రీనివాసపురం వద్ద ఎదురుగా వచ్చిన ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి... కారు అదుపుతప్పి బోల్తాపడింది. కారులో ఉన్న డ్రైవర్, మరొక ప్రయాణికుడు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ప్రమాదంలో కారు ముందు భాగం దెబ్బతింది. కారు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి బద్వేల్‌కు వస్తుండగా ప్రమాదం జరిగింది. రోడ్డుకు అడ్డంగా కారు బోల్తా పడడం వలన కొద్దిసేపు వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కారును రోడ్డు పక్కకు తొలగించారు.
బద్వేల్-నెల్లూరు హైవేపై కారు బోల్తా.. తప్పిన ప్రమాదం - car accident
బద్వేల్-నెల్లూరు 67వ జాతీయ రహదారిలో కారు ప్రమాదం జరిగింది. ఎదురుగా వచ్చిన వాహనాన్ని తప్పించబోయి.. కారు అదుపుతప్పి బోల్తాపడింది. అదృష్టవశాత్తు కారులో ఉన్నవారు స్వల్పగాయాలతో బయటపడ్డారు.
బద్వేల్-నెల్లూరు జాతీయ రహదారిలో కారు బోల్తా
ఇవీ చూడండి :కడప జిల్లాలో యువకుడు దారుణ హత్య
Last Updated : Nov 9, 2022, 1:52 PM IST