బీఎస్ఎన్ఎల్ ఆఫీస్లో భారీ అగ్నిప్రమాదం కడప బీఎస్ఎన్ఎల్ పరిపాలన కార్యాలయంలో విద్యుదాఘాతంతో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. కీలక దస్త్రాలు, కంప్యూటర్లు పూర్తిగాకాలిపోయాయి. మూడు వాహనాలతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అయినప్పటికీ మంటలు అదుపులోకి రాలేదు. ఆదివారం సెలవు సందర్భంగా సిబ్బంది విధులకు హాజరు కాలేదు.ఈ కారణంతో..మంటలను గుర్తించడం ఆలస్యమైందని స్థానికులు చెప్పారు.