ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కడప జిల్లాకు చేరిన ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు - students

పాఠశాలలు పునఃప్రారంభమైనా... విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందలేదనే మాట ఏటా వినిపించేది. అయితే ఈసారి అన్ని జిల్లాలకు సకాలంలో పాఠ్య పుస్తకాలు సరఫరా చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పాఠ్య పుస్తకాలు ఇప్పటికే ఆయా మండల కేంద్రాలకు చేరిపోయాయి.

కడప జిల్లాకు చేరిన 'ప్రభుత్వ' పుస్తకాలు

By

Published : Jun 7, 2019, 7:31 PM IST

కడప జిల్లాకు చేరిన 'ప్రభుత్వ' పుస్తకాలు

చాలా ఏళ్ల తర్వాత ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు పాఠశాలలు పునః ప్రారంభానికి ముందే వచ్చేశాయ్. ఏటా పాఠశాలలు తెరిచిన నెల, రెండు నెలలకు కూడా పుస్తకాలు వచ్చేవి కావు. ఈ కారణంగా.. తరగతులు సరిగ్గా జరగక విద్యార్థులు ఇబ్బంది పడేవారు. అయితే ఈసారి రాష్ట్ర ప్రభుత్వం బడులు తెరవడానికి పదిరోజుల ముందే కావాల్సిన పుస్తకాలను ఆయా జిల్లాలకు పంపింది.

కడప జిల్లాలో ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు 139 ఉన్నాయి. వాటిలో ఒకటి నుంచి పదో తరగతి వరకూ చదివే విద్యార్థులు 2 లక్షల 20 వేల మంది ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా మరో 800 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. వీటిలో మరో లక్షన్నర మంది విద్యార్థులు ఒకటి నుంచి పదో తరగతి వరకూ చదువుతున్నారు. జిల్లాలో మొత్తం 3 లక్షల 70 వేల మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి 13 లక్షల 05వేల 643 పుస్తకాలు అవసరమని జిల్లా విద్యాధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. గతేడాది కడప గోదాములో 2లక్షల 79వేల 699 పుస్తకాలు మిగిలిపోయాయి. వాటిని మినహాయిస్తే ఇంకా 11లక్షల 12వేల 166 పాఠ్య పుస్తకాలు జిల్లాలో ఉన్నాయి. ఇప్పటి వరకూ 10లక్షల 74వేల 882 పుస్తకాలు జిల్లా కేంద్రానికి చేరాయి.

వచ్చిన పుస్తకాలన్నింటినీ ఆయా మండల కేంద్రాల్లోని మండల విద్యాధికారి కార్యాలయాలకు చేరిపోయాయనీ.. మిగిలిన పుస్తకాలు ఈనెల 12వ తేదీలోగా వస్తాయని జిల్లా విద్యాధికారిణి శైలజ తెలిపారు.

ఇవీ చదవండి..

బొండా ఉమపై పరువు నష్టం దావా వేస్తా : కోగంటి

ABOUT THE AUTHOR

...view details