కడప జిల్లా కమలాపురం పట్టణానికి చెందిన మహమ్మద్ రఫీక్... గతంలో బైక్ మెకానిక్‌గా పనిచేసేవాడు. ఈ క్రమంలో అప్పులు అయ్యాయి. వాటిని ఎలా తీర్చాలో అర్థం కాని అతను... ద్విచక్రవాహనాల చోరీకి అలవాటు పడ్డాడు. ప్రొద్దుటూరు పట్టణంలోని పలు ప్రాంతాల్లో నిలపి ఉంచిన బైక్‌లను దొంగలించాడు. ఈ క్రమంలో... ఎర్రగుంట్ల బైపాస్ రహదారిలో వాహనాలు తనిఖీలు చేస్తున్న పోలీసులను చూసి రఫీక్ పారిపోయే ప్రయత్నం చేశాడు. అనుమానించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా... ద్విచక్ర వాహనాలు దొంగిలించినట్లు ఒప్పుకున్నాడు. పోలీసులు అతని వద్ద నుంచి 4ద్విచక్ర వాహనాల స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ.లక్షా 50వేల ఉంటుందని ప్రొద్దుటూరు డీఎస్పీ సుధాకర్ వెల్లడించారు.
అప్పులు చేశాడు... తీర్చలేక దొంగయ్యాడు..!
చేసిన అప్పులు తీర్చేందుకు ఓ యువకుడు అక్రమ మార్గాన్ని ఎంచుకున్నాడు. ద్విచక్ర వాహనాలు చోరీ చేసి... వాటిని అమ్మి అప్పులు తీర్చేందుకు దొంగ అవతారమెత్తాడు. ఆఖరికి పోలీసులకు చిక్కి బుక్కయ్యాడు.
అప్పులు చేశాడు... తీర్చలేక దొంగయ్యాడు