కడప జిల్లాలో గొలుసు దుకాణాలు నిర్మూలనకు శ్రీకారం చుట్టామని ఎక్సైజ్ అధికారి మునిస్వామి తెలిపారు. కొన్ని గ్రామాలను కానిస్టేబుళ్లు దత్తత తీసుకొని గొలుసు దుకాణాలు లేకుండా కృషి చేస్తున్నామన్నారు. కడప ఎక్సైజ్ కార్యాలయంలో మద్యం దుకాణదారులతో అధికారులు సమావేశం ఏర్పాటు చేశారు. వారికి పలు సూచనలు, సలహాలు జారీ చేశారు. అధిక సంఖ్యలో మద్యం విక్రయించరాదని, పొరపాటున ఎవరైనా గొలుసు దుకాణాలు నిర్వహిస్తున్నట్లు తెలిస్తే దుకాణాల లైసెన్స్ తో పాటు కేసులు నమోదు చేస్తామన్నారు. రేపటి నుంచే దాడులకు శ్రీకారం చుడతామని స్పష్టం చేశారు. గొలుసు దుకాణాలపై ప్రభుత్వం కఠినతరంగా ఉందని తెలిపారు.
రేపటి నుంచి గొలుసు దుకాణాల నిర్మూలన - belt shops
కడప జిల్లాలో గొలుసు దుకాణాల నిర్మూలనకు ఎక్సైజ్ శాఖ సిద్ధమైంది . రేపటి నుంచి బెల్టు షాపులపై దాడులు చేస్తామని ఎక్సైజ్ అధికారి తెలిపారు.
కడపలో బెల్టు షాపులపై ఎక్సైజ్ పంజా