కడప జిల్లా రాయచోటి రెవెన్యూ కార్యాలయంలో నాయబ్ తహసీల్దార్‌గా పనిచేస్తోన్న నరసింహకుమార్‌కు సాహిత్యం, సంగీతం, గేయ రచన పాటలు పాడడం అంటే ఆసక్తి. లాక్‌డౌన్‌పై చక్కటి రచనలతో పాట పాడి ఉన్నతాధికారుల మన్ననలు పొందారు. ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితిలో పాటల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్న నరసింహను పలువురు అభినందిస్తున్నారు.
పాటతో లాక్డౌన్ పై ప్రజలకు అవగాహన - కడప జిల్లా వార్తలు
ఆయన ఓ ప్రభుత్వ ఉద్యోగి. సామాజిక సేవ అంటే ఆయనకు ఎంతో ఇష్టం. సమాజ హితం కోరి పాటల ద్వారా ప్రజల్లో చైతన్యం నింపుతున్నారు. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా పాటించాల్సిన సూచనలు, జాగ్రత్తలను చక్కగా పాటల రూపంలో పాడి శభాష్ అనిపించుకున్నారు.
పాటతో లాక్డౌన్ పై ప్రజలకు అవగాహన