వేలం పాటకు కరోనా దెబ్బ - auction news in jammalamadugu municipality
జమ్మలమడుగు నగర పంచాయతీలోని కూరగాయల మార్కెట్, బండ్ల మిట్ట, బస్టాండ్, మాంసం మార్కెట్కు వేలంపాట నిర్వహించారు. ప్రభుత్వం వారిపాటకు ఆశించినంత లాభం రాకపోవటంతో అధికారులు డీలా పడ్డారు. కరోనా కారణంగా మున్సిపాలిటీ ఆదాయానికి భారీగా గండి పడిందని వాపోతున్నారు.
నాలుగు విభాగాల్లో వేలంపాట నిర్వహించిన అధికారులు
కడప జిల్లా జమ్మలమడుగు నగర పంచాయతీకి నిర్వహించిన వేలంపాటలో ఆశించినంత లాభం రాకపోవటంతో అధికారులు డీలా పడ్డారు. జమ్మలమడుగు నగర పంచాయతీలోని కూరగాయల మార్కెట్, బండ్ల మిట్ట, బస్టాండ్, మాంసం మార్కెట్కు వేలంపాట జరిగింది.
- కూరగాయల మార్కెట్ కోసం ప్రభుత్వం వారిపాట రూ.11,53,300 నిర్ణయించగా వ్యాపారులు రూ.11,54,300కు పాడారు. ఇందులో కేవలం రూ.1000 మాత్రమే లాభం వచ్చింది.
- బండ్ల మిట్టకు రూ.2,90,100 ప్రారంభించగా 2,96,000 దక్కించుకోగా ఇందులో రూ.5900 అదనంగా వచ్చింది.
- బస్టాండ్ కోసం రూ.4,93,500 నిర్ణయించగా... వ్యాపారులు రూ.4,95,000కు పాడారు. దీనిలో రూ.1500 లాభం వచ్చింది.
- మాంసం మార్కెట్ కోసం ప్రారంభ ధర రూ.1,94,200 నిర్ణయించగా... రూ.1,97,500 పాట దక్కించుకున్నారు. ఇందులో రూ.3,300 లాభం వచ్చింది. మొత్తం నాలుగు విభాగాల్లోను నగర పంచాయతీకి ఆశించినంతగా లాభం రాకపోవటంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. కరోనా దెబ్బ వల్ల మున్సిపాలిటీ ఆదాయానికి భారీగా గండి పడిందని వాపోతున్నారు.
ఇదీ చూడండి:రూపాయి చిహ్నం వెనుక ఇంత సంగతుందా!
TAGGED:
jammalamadugu latest updates