Asha workers Strike To Demand solve Problems In Government: ఆశా కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారికి నెలకు 26వేల రూపాయలు వేతనం ఇవ్వాలని, ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కడప కలెక్టరేట్ ఎదుట ఏఐటీయూసీ (AITUC) ఆధ్వర్యంలో సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు. ఆశా కార్యకర్తలపై పెంచిన పని ఒత్తిడిని తగ్గించాలని రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకట సుబ్బయ్య డిమాండ్ చేశారు. చేతిలో ప్లకార్డులు పట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు 26వేల రూపాయలు జీతం అధికారంలోకి రాగానే పెంచుతానని భరోసా ఇచ్చారు.
ఆశా కార్యకర్తల సమస్యలపై అన్ని జిల్లాల్లో ఉద్యమాలు జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆశా వర్కర్లకు కనీస వేతనాలు ఇవ్వకుండా వారితో అన్ని పనులు చేయించుకుంటున్నారు. వారికి కనీస వేతనం 26వేల రూపాయలు ఇవ్వాలి. పీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలు ఏమి లేవు. ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం మరింత తీవ్రంగా ఉంటుంది :- వెంకటసుబ్బయ్య, ఏఐటీయుసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు.
Asha Workers Demand To Recognized As Government Employees: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరాలు అయినా జీతాలు పెంచలేదంటూ ఆశా వర్కర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆశా కార్యకర్తలు ప్రభుత్వ ఉద్యోగులు కాకపోయినప్పటికీ వారికి ఎలాంటి ప్రభుత్వ పథకాలు వర్తింప చేయడం లేదని వెంకటసుబ్బయ్య అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు అయితే కనీసం పీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలు ఉండేవని అవి ఏమి లేకపోగా జీతాలు పెంచట్లేదని ఆయన పేర్కొన్నారు. అనేక కొత్త యాప్లతో పని ఒత్తిడి పెంచుతున్నారని ఆశా కార్యకర్తలు తెలిపారు. కనీసం తమ సమస్యలను చెప్పుకునేందుకు కూడా అధికారులు అనుమతించడం లేదని వాపోతున్నారు. ధర్నాలకు వెళ్తే ఉద్యోగాల్లో నుంచి తొలగిస్తామనడం దారుణమంటున్నారు. రిటైర్డ్ అయిన ఆశా వర్కర్లకు ఐదు లక్షల రూపాయలు పారితోషికం ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అలానే ప్రతి నెల 10వేల రూపాయలు పింఛన్ ఇవ్వాలని పేర్కొన్నారు. సమస్యలను పరిష్కరించకుంటే తెలంగాణ ప్రభుత్వానికి పట్టిన గతే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పడుతుందని హెచ్చరించారు.
మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించాలి. ఆశా వర్కర్లకు 26వేల రూపాయల జీతం ఇవ్వాలి. పీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలు కల్పించాలి. రిటైర్మెంట్ బెనిఫిట్ కింద 5లక్షల రూపాయలు ఇవ్వాలి. రిటైర్మెంట్ చేశాక సగం జీతం చెల్లించాలి. పని భారం, ఒత్తిడి తగ్గించాలి. మా సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి.:-శాంతమ్మ, ఆశా వర్కర్.