కడప జిల్లా చక్రాయపేట మండలంలోని గండి వీరాంజనేయ స్వామి ఆలయం నుంచి తిరుమల వరకు.. ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి తన బృందంతో పాదయాత్ర చేపట్టారు. తొలుత స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. దాదాపు 160 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగనుంది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని తిరుమల శ్రీవారిని మొక్కుకున్నట్లు తెలిపారు. రైతులు, ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఈ పాదయాత్ర చేపడుతున్నట్లు వివరించారు. రాయచోటి నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని అన్నారు. పాదయాత్రలో ఆయన వెంట అధిక సంఖ్యలో వైసీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి తిరుమల పాదయాత్ర - ap cihef vip gadikota srikanth reddy padayatra news
ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి.. గండి వీరాంజనేయ స్వామి ఆలయం నుంచి తిరుమల వరకూ పాదయాత్ర చేపట్టారు. తొలుత ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం తన బృందంతో కలిసి పాదయాత్రగా బయలుదేరారు. ఆయన వెంట వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి తిరుమల పాదయాత్ర