కడప జిల్లా జమ్మలమడుగు మండలం సుగుమంచిపల్లె గ్రామంలో పెన్నా నది ఒడ్డున ఇసుక తిన్నెల్లో కూరుకుపోయిన పురాతన శివాలయాన్ని కేంద్ర పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు. ఆలయంలో ధ్వజస్తంభం ముక్కతో పాటు నాలుగున్నర అడుగుల వరకు ఉన్న శిలా శాసనం, పురాతన విగ్రహాలు బయటపడ్డాయి. శిలాశాసనానికి ఇరువైపులా సంస్కృతం, కన్నడ లిపిలో రాసి ఉన్నట్లు కేంద్ర పురావస్తు శాఖ అధికారులు వెల్లడించారు. వీటిని రాష్ట్రకూటుల పరిపాలనా కాలంలో మూడో కృష్ణుడు వేయించి ఉంటారని అధికారులు భావిస్తున్నారు.
పెన్నా తీరంలో బయటపడిన పురాతన శివాలయం - కడప జిల్లాలో పురాతన శివాలయం గుర్తింపు వార్తలు
కడప జిల్లా జమ్మలమడుగు మండలంలో పెన్నా నది ఒడ్డున పురాతన శివాలయం బయటపడింది. అలాగే ఆ ప్రాంతంలో శిలా శాసనం, పురాతన విగ్రహాలను కేంద్ర పురావస్తు శాఖ గుర్తించింది.
An ancient Shiva temple has emerged on the banks of the river Penna in kadapa district
పూర్వ సుగుమంచిపల్లెలో శివాలయం ఓ వెలుగు వెలిగిందని... కొన్నేళ్ల క్రితం ఇసుక తిన్నెల్లో గ్రామం కూరుకుపోయి కనుమరుగైందని స్థానికులు తెలిపారు. ఇప్పుడు తమ గ్రామాలకు సంబంధించిన పురాతన కాలం నాటి శిలాశాసనాలు బయటపడటం ఆనందంగా ఉందని తెలిపారు.