ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కడపలో మంత్రి అంజాద్​బాషాకు ఘన స్వాగతం - ఉపముఖ్యమంత్రి

ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్​రెడ్డి మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాల పట్ల రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని ఉపముఖ్యమంత్రి అంజాద్​బాషా అన్నారు. మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి నియోజకవర్గానికి వచ్చిన మంత్రికి వైకాపా శ్రేణులు ఘన స్వాగతం పలికారు.

మంత్రి బాధ్యతల తర్వాత తొలిసారి కడపకు అంజద్​ బాషా

By

Published : Jun 11, 2019, 6:22 PM IST

Updated : Jun 11, 2019, 7:15 PM IST

మంత్రి బాధ్యతల తర్వాత తొలిసారి కడపకు అంజాద్​బాషా

ఉపముఖ్యమంత్రి, మైనార్టీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఉపముఖ్యమంత్రి అంజాద్​బాషా సొంత నియోజకవర్గమైన కడపకు వచ్చారు. ఆయనకు పార్టీ నాయకులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. అల్మాస్​పేట నుంచి కడప పెద్ద దర్గా వరకు ర్యాలీగా వచ్చారు. కడప పెద్దదర్గాలో మఠాధిపతులు ఉపముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. అమీన్ పీర్ దర్గాకు చాదర్ సమర్పించి.. మంత్రి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో కడప జిల్లా అభివృద్ధిలో వెనక పడిందన్న ఆయన... జగన్ సారథ్యంలో జిల్లా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Last Updated : Jun 11, 2019, 7:15 PM IST

ABOUT THE AUTHOR

...view details