వైకాపా ప్రభుత్వానికి ఏ మాత్రం పౌరుషమున్నా స్థానిక సంస్థల ఎన్నికలను వెంటనే రద్దు చేయాలని మాజీ మంత్రి, భాజపా నాయకుడు ఆదినారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంత తక్కువ సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించిన ముఖ్యమంత్రి ఎవరూ లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్.. ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా మారిందని ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియ అవకతవకలుగా ఉందని.. నామినేషన్ వేయడానికి వెళ్తే అడ్డుకుంటున్నారని వాపోయారు. నామినేషన్లతో పని లేకుండా జడ్పీటీసీ, ఎంపీటీసీలను నామినేట్ చేయాలని ఎద్దేవా చేశారు. ఎన్నికలను వెంటనే రద్దు చేసి కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర బలగాల నేతృత్వంలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేశారు.
'కేంద్ర ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికలు నిర్వహించాలి' - latest news on local body elections
స్థానిక ఎన్నికలను వెంటనే రద్దు చేసి.. కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర బలగాల నేతృత్వంలో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా మారిందని ఆరోపించారు
స్థానిక ఎన్నికలపై ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్య