2007 నుంచి అదే పనిలో ఉన్నారు: అనిశా డీఎస్పీ - దాడులు
కడప వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ లూర్దయ్యనాయుడు దాదాపు 5 కోట్ల రూపాయల అక్రమాస్తులు కల్గి ఉన్నారని కడప అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ నాగభూషణం తెలిపారు. కడపలోని ఆయన నివాసంలో తనిఖీలు చేయగా భారీగా ఆస్తులు బయట పడ్డాయన్నారు.
2007 నుంచీ...అదే పనిలో ఉన్నారు
కడప వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ లూర్దయ్యనాయుడుపై అనిశా దాడులు చేసింది. విజయవాడ, బెంగళూరు, హైదరాబాద్లోని లూర్దయ్యనాయుడు బంధువుల ఇళ్లలో జరుగుతున్న సోదాల్లో మరిన్ని అక్రమాస్తులు బయటపడే వీలుందని కడప అనిశా డీఎస్పీ నాగభూషణం తెలిపారు. లూర్దయ్యనాయుడు దంపతుల పేరిట కర్నూలు సిండికేట్ బ్యాంకులో ఉన్న లాకర్ తెరవడానికి మరో బృందం వెళ్లిందన్నారు. లూర్దయ్యనాయుడు భార్య, పిల్లల పేరుతో 20 ఎకరాల వ్యవసాయ భూమి ఉందని వెల్లడించారు.