Gadapa Gadapaku program:వైఎస్ఆర్ జిల్లా కమలాపురంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డికి మహిళల నుంచి నిరసన సెగ తగిలింది. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు సరిగా లేకపోవటంపై మహిళలు ఎమ్మెల్యేను నిలదీశారు. తమను సంక్షేమ పథకాల జాబితా నుంచి తొలగించారని.. ఎమ్మెల్యే ముందు లబ్ధిదారులు గోడు వెలిబుచ్చారు. సంక్షేమ పథకాలు అందాలంటే, అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే వారికి సర్ది చెప్పారు. సమస్యల పరిష్కారానికే మీ దగ్గరకు వచ్చానని ప్రజలతో అన్నారు.
వైఎస్ఆర్ జిల్లాలో ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డికి నిరసన సెగ - Gadapa Gadapaku program
Gadapa Gadapaku program గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైఎస్ఆర్ జిల్లాలోని ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. మీ సమస్యల పరిష్కారం కోసమే మీ వద్దకు వచ్చాను అని ఎమ్మెల్యే ప్రజలతో అన్నారు.
వైఎస్ఆర్ జిల్లాలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం