ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆ పాఠశాలలు సమస్యలకు నిలయాలు - A little rain in the school

కడపజిల్లా ప్రొద్దుటూరులోని ప్రభుత్వ పాఠశాలలు సమస్యలకు నిలయంగా మారాయి. సమస్యల వలయంలో చిక్కుకున్న పాఠశాలలో విద్యార్ధులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. తమ పాఠశాల సమస్యలను తీర్చాలని ఉపాధ్యాయులు వేడుకుంటున్నారు.

పాఠశాలలో చిన్నపాటి వర్షంకే..అవస్థలు

By

Published : Sep 23, 2019, 4:01 PM IST

పాఠశాలలో చిన్నపాటి వర్షంకే..అవస్థలు

కడప జిల్లా ప్రొద్దుటూరులో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దయనీయంగాఉంది.నియోజక వర్గంలో మొత్తం9ఉన్నతపాఠశాలలు,24ప్రాథమిక పాఠశాలలు,ఒక ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి.ఈ పాఠశాలల్లో వేలాది మంది విద్యార్థులు చదువుతున్నారు.అయితే,పాఠశాలల్లో సౌకర్యాలు అంతంత మాత్రమే ఉండటంతో,విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.ఏ పాఠశాల చూసినా అనేక సమస్యలు దర్శనమిస్తున్నాయి.ఉపాధ్యాయులు,విద్యార్దులు చేసేది ఏమిలేక అలాగే సర్దుకుపోతున్నారు.చిన్నపాటి వర్షం కురిస్తే చాలు పాఠశాల ఆవరణమంతా నీటితో నిండిపోతోంది.తరగతి గదులు శిథిలావస్థకు చేరి పెచ్చులు ఉడుతున్నాయి.ఈ గదుల్లోనే విద్యార్ధులు బిక్కుబిక్కుమంటూ చదువులు కొనసాగిస్తున్నారు.అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవటం లేదని ఉపాధ్యాయులు వాపోతున్నారు.ఇకనైనా అధ్వాన స్థితిలో ఉన్న పాఠశాలలను బాగు చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటే విద్యార్థులు శ్రద్ధగా చదువుకుంటారని ఉపాధ్యాయులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details