- 13న జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం
ఈ నెల 13వ తేదీన సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. 13వ తేదీ ఉదయం 11 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం భేటీ అవుతుందనీ ప్రభుత్వం స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రేపు దిల్లీకి చంద్రబాబు.. ప్రధాని అధ్యక్షతన జరిగే సమావేశానికి హాజరు
ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే రాజకీయ పార్టీ అధ్యక్షుల సమావేశంలో పాల్గొనేందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు రేపు దిల్లీకి వెళ్లనున్నారు. ఈ నెల 1వ తేదీ నుంచి వచ్చే ఏడాది నవంబర్ 30 వరకూ జీ 20 దేశాల కూటమికి భారతదేశం అధ్యక్షత వహిస్తున్న విషయం తెలిసిందే. భారత్‌లో నిర్వహించే జీ -20 భాగస్వామ్య దేశాల సమావేశాలపై రాజకీయ పార్టీల అధ్యక్షులతో చర్చించేందుకు ప్రధాని.. రాష్ట్రపతి భవన్లో రేపు సాయంత్రం 5 గంటలకు సదస్సు నిర్వహించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ‘మార్గదర్శి’కి కళంకం ఆపాదించే కుట్ర.. ఆరోపణలను తిప్పికొట్టిన యాజమాన్యం
‘మార్గదర్శి’కి కళంకం ఆపాదించాలనే కుట్రతోనే స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్, ఐజీ నిరాధార ఆరోపణలు చేశారని మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ పేర్కొంది. ఖాతాదారుల్లో భయోత్పాతం సృష్టించి మార్గదర్శి ప్రతిష్ఠను దెబ్బతీయడమే వారి అసలు లక్ష్యమని వెల్లడించింది. నిప్పులాంటి నిజాలతో, సహేతుక వివరణలతో ప్రతీ ఆరోపణను తిప్పికొట్టింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- తెలుగు నేల ఉన్నంత వరకు.. ఘంటసాల పాట నిలిచి ఉంటుంది: మంత్రి రోజా
" తెలుగు నేల ఉన్నంత వరకు ఘంటసాల పాట నిలిచి ఉంటుందని పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి ఆర్‌కే రోజా అన్నారు. విజయవాడలో ఘంటసాల సంగీత కళాశాలలో నిర్వహించిన.. జయంతి వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. ఆయన జీవితం యువతకు ఆదర్శమని వ్యాఖ్యానించారు. ఘంటసాల కేవలం గాయకుడే కాదు స్వాతంత్య్ర పోరాట యోధుడిగా మంత్రి రోజా అభివర్ణించారు. ఘంటసాలకు భారతరత్న కోసం అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మహిళకు అరుదైన శస్త్రచికిత్స.. 3.5 కిలోల కణితి తొలగించిన వైద్యులు
పంజాబ్ వైద్యులు ఓ అరుదైన ఆపరేషన్ చేశారు. ఓ మహిళ పొట్టలోనుంచి 3.5 కిలోల కణితిని తొలగించారు. ఎన్నో ఆస్పత్రిలు తిరిగి అక్కడకు చేరుకున్న ఆమెకు.. ఆ వైద్యులు పునర్జన్మ అందించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 93 స్థానాలు.. 833 మంది అభ్యర్థులు.. గుజరాత్ రెండో దశ పోలింగ్‌కు సర్వం సిద్ధం
ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారిన గుజరాత్ ఎన్నికల రెండోవిడత పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. 14 జిల్లాల పరిధిలోని 93 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరగనుంది. ఈ విడతలో గుజరాత్ సీఎం భూపేంద్రపటేల్, పటీదార్ ఉద్యమకారుడు హార్దిక్ పటేల్, ఓబీసీ నేత అల్పేష్ ఠాకూర్ తదితరులు పోటీలో ఉన్నారు. పోలింగ్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఇరాన్ 'హిజాబ్' వివాదంలో దిగొచ్చిన ప్రభుత్వం.. నైతిక పోలీసు వ్యవస్థ రద్దు
హిజాబ్‌కు వ్యతిరేకంగా రెండు నెలలకుపైగా భారీ ఎత్తున ఆందోళనలు చెలరేగిన వేళ ఇరాన్ సర్కారు ఎట్టకేలకు దిగివచ్చింది. నైతిక పోలీసు వ్యవస్థను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. హిజాబ్ చట్టాల అమలు కోసం 2005లో ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. హిజాబ్ సరిగ్గా ధరించలేదని మాసా అమీని అనే యువతిపై నైతిక పోలీసులు దాడి చేయగా ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ నేపథ్యంలో రెండు నెలలకుపైగా హిజాబ్ వ్యతిరేక ఆందోళనలతో ఇరాన్ అట్టుడుకింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పిల్లల భవితకు భరోసా.. ఉన్నత విద్య కోసం ప్లాన్ చేయండిలా..
పిల్లలు ఉన్నత చదువులు చదవాలి అనే కోరిక ప్రతి తల్లిదండ్రుల్లోనూ ఉంటుంది. అందుకే, వీలైనంత మొత్తాన్ని పెట్టుబడులకు కేటాయిస్తూ.. భవిష్యత్ ఖర్చులకు సిద్ధంగా ఉంటారు. విద్యా ద్రవ్యోల్బణం రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో దీనికి మించి రాబడి ఆర్జించే మార్గాల్లో మదుపు చేయాలి. అదే సమయంలో ఆర్జించే కుటుంబ పెద్దకు ఏదైనా అనుకోనిది జరిగినప్పుడు వారి చదువులకు ఎలాంటి ఆటంకం ఎదురవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బంగ్లాదేశ్‌కు టార్గెట్ ఫిక్స్.. మెరిసిన రాహుల్
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ 186 పరుగులకు ఆలౌటైంది. టాప్ ఆర్డర్ విఫలం కాగా.. మిడిల్ ఆర్డర్‌లో వచ్చిన కేఎల్ రాహుల్ (73) అర్ధ శతకంతో రాణించడంతో భారత్ ఈ మాత్రం స్కోరు చేయగలిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'ఐ యామ్ బ్యాక్'.. మహేశ్ పోస్ట్ వైరల్.. అందుకే ఆయన్ను టాలీవుడ్ ప్రిన్స్ అంటారంట!
సూపర్ స్టార్ మహేశ్ బాబు తిరిగి షూటింగ్లో బిజీ కాబోతున్నారు. తాజాగా ఓ యాడ్ షూటింగ్లో పాల్గొన్నారు. అందులో భాగంగా దిగిన ఫొటోను ప్రేక్షకులతో పంచుకున్నారు. 'తిరిగి పనిలోకి వచ్చా' అంటూ రాసుకొచ్చారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
TOP NEWS