ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రెండురోజులుకు పైగా చెట్లపైనే... - నీటమునిగిన గుర్రపుగుంపు తండా వార్తలు

50 గంటలు.. 50 కుటుంబాలు.. అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ నీటి మధ్యే గడిపారు. చుట్టూ నీరు... బయటికి వచ్చే ఆస్కారం లేదు. ఇక ప్రాణాలు పోతాయి అనుకున్న సమయంలో అగ్నిమాపక శాఖ సిబ్బంది దేవుడిలా వచ్చి ఆ కుటుంబాలను కాపాడిన ఘటన కడప జిల్లా గుర్రంగుంపు తండాలో జరిగింది.

50families were strucked in flood water at gurapugumpu tanda in kadapa
రెండురోజులుకు పైగా చెట్లపైనే... ప్రాణాలు అరచేతిలోనే

By

Published : Nov 29, 2020, 3:27 PM IST

కడప శివారులోని గుర్రంగుంపు తండాలో సుమారు 50 గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయి. నివర్ తుపాను ప్రభావంతో బుగ్గవంక డ్యాం నిండటంతో... అధికారులు దిగువకు నీటిని విడుదల చేశారు. ఒకేసారి నీరు లోతట్టు ప్రాంతాలను చుట్టుముట్టడంతో స్థానికులు చెట్లపైకి ఎక్కి, ఇతర ప్రదేశాల్లోని నివాసాల్లో తలదాచుకున్నారు. రెండు రోజుల తర్వాత విషయం తెలుసుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది బోట్ల సహాయంతో వారు ఉంటున్న ప్రాంతానికి వెళ్లారు. బాధితులందరినీ బోట్లలో ఒడ్డుకు చేర్చారు. చనిపోతామనుకున్న తమను ప్రాణాలతో సురక్షితంగా ఒడ్డుకు చేర్చటంతో... స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details