కడప జిల్లా ఖాజీపేట మండలం నాగపట్నం సమీప కొత్త బావి వద్ద నలుగురు స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు మైదుకూరు డీఎస్పీ బి. విజయ్ కుమార్ తెలిపారు. వీరి నుంచి ఒక గూడ్సు వాహనంతో పాటు రూ. 9 లక్షల విలువ చేసే 23 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు అందిన సమాచారంతో ఖాజీపేట ఎస్ఐ అరుణ్ కుమార్ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించినట్లు తెలిపారు. అరెస్ట్ చేసిన వారిలో ఖాజీపేట మండలం కొత్తూరు గ్రామానికి చెందిన ఇద్దరు పిల్లలతో పాటు కర్నాటక రాష్ట్రం బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీకి చెందిన మరో ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు వివరించారు.
23 ఎర్రచందనం దుంగలు స్వాధీనం - కడప జిల్లా వార్తలు
కడప జిల్లా ఖాజీపేట మండలంలో ఎర్రచందనం స్మగ్లర్లపై పోలీసులు దాడి చేశారు. నలుగురిని అరెస్టు చేశారు. రూ. 9 లక్షల విలువ చేసే 23 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఒక వాహనాన్ని సీజ్ చేశారు.
23 ఎర్రచందనం దుంగలు స్వాధీనం