అక్రమంగా తరలిస్తున్న రూ.10 లక్షల నగదు స్వాధీనం - police seized money in kadapa latest news
వారి వద్ద ఉన్న డబ్బుకు సరైన రశీదు లేదు.. అయినా ఎవరు అడుగుతారులే అనుకుని చక్కగా వాహనంలో 10 లక్షలు తరలించాలనుకున్నారు. పోలీసులకు దొరికిపోయారు. ఈ సంఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది.
ఎలాంటి రశీదులు లేకుండా తీసుకెళ్తున్న 10 లక్షల రూపాయల నగదును కడప జిల్లా కలమల్ల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కలమల్ల- ముద్దనూరు క్రాస్‌రోడ్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా ప్రొద్దుటూరు నుంచి ఇన్నోవా వాహనం వచ్చింది. వాహనాన్ని ఆపి తనిఖీ చేసిన పోలీసులు 10 లక్షల రూపాయల నగదు ఉన్నట్టు గుర్తించారు. అందుకు సంబంధించి రశీదులు చూపకపోవడం వలన ఆ మొత్తాన్ని ప్రొద్దుటూరు ఇన్‌కమ్‌టాక్స్ అధికారులకు పోలీసులు అప్పగించారు. ప్రొద్దుటూరు మండలం సోములవారి పల్లెకు చెందిన నాగేశ్వరరావు నగదుగా పోలీసులు గుర్తించారు.