నాలుగు రోజుల్లో పెళ్లి అనగా యువకుడి ఆత్మహత్య - యువకుడు ఆత్మహత్య
నాలుగు రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కేబుల్ వైరుతో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు బూస రవి. యువకుడి ఆత్మహత్యకు కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరో నాలుగు రోజుల్లో వివాహం. అంతా ఏర్పాట్లలో ఉన్నారు. ఇంతలో జరగరాని ఘోరం జరిగిపోయింది. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరానికి చెందిన బూస రవికి... తడికలపూడికి చెందిన యువతితో జూన్ 22న వివాహం జరగాల్సి ఉంది. బంధువులందరికీ శుభలేఖలు పంచారు. పెళ్లి పనులూ జోరుగా సాగుతున్నాయి. ఇంతలో మంగళవారం తెల్లవారుజామున రవి... కేబుల్ వైరుతో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.