ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెదేపా, వైకాపా అభ్యర్థుల తోపులాట.. ఉద్రిక్తత - పశ్చిమగోదావరి జిల్లా

దెందులూరు నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైకాపా, తెదేపా అభ్యర్థుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

తెదేపా,వైకాపా అభ్యర్థుల తోపులాట...పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తత.

By

Published : Apr 5, 2019, 9:01 PM IST

పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైకాపాకు చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి ఎన్నికల అధికారిని కాదని... తప్పుగా పోస్టల్ బ్యాలట్​ను వినియోగించుకుంటున్నారని తెదేపా నాయకులు ఆరోపించారు. ఈ విషయంలో అక్కడే ఉన్న వైకాపా అసెంబ్లీ అభ్యర్థి అబ్బయ్య చౌదరి... తెదేపా అభ్యర్థి చింతమనేని మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ ఘటన కార్యకర్తల మధ్య తోపులాటకు దారి తీసింది. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇరు పార్టీల అభ్యర్థులను మందలించారు.

తెదేపా,వైకాపా అభ్యర్థుల తోపులాట...పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తత.

ABOUT THE AUTHOR

...view details